రాష్ట్ర ప్రభుత్వం ‘సన్నబియ్యం పథకం’ ప్రారంభించింది. ఈ పథకాన్ని సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఏప్రిల్ 1 నుండి తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు.
కాగా, ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు నాయకులు పాల్గొన్నారు.
ప్రతి అర్హతగల కుటుంబానికి రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిందని సీఎం రేవంత్ అన్నారు. సన్న బియ్యం పథకం ద్వారా ప్రజలకు కొత్తగా ఆర్థిక సహాయం అందించబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. 80 శాతానికి పైగా ప్రజలు ఈ పథకాన్ని ఉపయోగించుకోగలుగుతారని తెలిపారు. ఇక.. సన్నబియ్యం పథకంలో ముఖ్యంగా ‘మూడు రంగుల కార్డులను’ విడుదల చేస్తామని అన్నారు. వాటిలో గులాబీ కార్డుదారులకు ప్రత్యేకంగా సన్నబియ్యం 6 కిలోలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రేషన్ కార్డుదారులకు అనేక ప్రయోజనాలను అందించడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు.