హైదరాబాద్ : ఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి దారితీసిన మూలాలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.