TG | జిల్లా ఇంఛార్జి మంత్రుల్లో మార్పులు..

  • కొత్త బాధ్యతలతో నూతన కేటాయింపు

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ అనంతరం, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పరిపాలనను మరింత సమర్థంగా నిర్వహించేందుకు జిల్లాల ఇంఛార్జి మంత్రుల్లో మార్పులు చేశారు. పలు జిల్లాలకు కొత్త మంత్రులను ఇంఛార్జిగా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఎవరికి ఏ జిల్లా బాధ్యతలు…

ఉత్తమ్ కుమార్ రెడ్డి (కరీంనగర్), కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఖమ్మం), కొండా సురేఖ (మెదక్) – వీరి స్థానాల్లో కొత్త మంత్రులకు బాధ్యతలు అప్పగించారు.

సీతక్క – ఇప్పటివరకు ఆదిలాబాద్‌ ఇంఛార్జిగా ఉన్న ఆమెకు నిజామాబాద్‌ జిల్లా బాధ్యతలు అప్పగించారు.
జూపల్లి కృష్ణారావు – నిజామాబాద్ ఇంఛార్జిగా ఉన్న ఆయనకు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా బాధ్యతలు ఇచ్చారు.
తుమ్మల నాగేశ్వరరావు – నల్గొండ‌ నుంచి కరీంనగర్‌ జిల్లా ఇంఛార్జిగా మారారు.
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ – నల్గొండ‌ జిల్లా ఇంఛార్జిగా నియమించబడ్డారు.
వాకిటి శ్రీహరి – ఖమ్మం‌ జిల్లా ఇంఛార్జిగా బాధ్యతలు పొందారు.
వివేక్ వెంటస్వామి – మంత్రివర్గంలో కొత్తగా చేరిన ఆయనకు మెదక్‌ జిల్లా బాధ్యత లభించింది.

మహబూబ్‌నగర్‌ ఇంఛార్జిగా దామోదర్‌ రాజనర్సింహ, రంగారెడ్డికి శ్రీధర్‌ బాబు, వరంగల్‌కు పొంగులేటి శ్రీనావాస్‌ రెడ్డి, హైదరాబాద్‌కు పొన్నం ప్రభాకర్‌ యధాతదంగా కొనసాగుతారు.

Leave a Reply