TG | గులాబీ జాతరకు కదిలిన దండు

రజతోత్సవానికి  బయల్దేరిన కొత్తపల్లి బిఆర్ఎస్ కార్యకర్తలు
14ఏళ్ల పోరాట ఫలితం స్వరాష్ట్రం..
10 ఏండ్ల కేసీఆర్ పాలన  స్వర్ణ యుగం:
మండల అధ్యక్షుడు మధుసూధన్ రెడ్డి
మద్దూరు ఏప్రిల్ 27(ఆంధ్రప్రభ): తెలంగాణ ఇంటి బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ సంబురానికి పార్టీ తలపెట్టిన ఆవిర్భావ సభకు ఐదు రోజుల నుంచి సభ కోసం గ్రామగ్రామాన నాయకులు ఏర్పాట్లు చేయడం జరిగింది.కొడంగల్ నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పిలుపు మేరకు గ్రామాలు, మునిసిపాలిటీల్లోని వార్డుల్లో ఉదయమే గులాబీ జెండాలు ఆవిష్కరించి, ప్రత్యేక వాహనాల్లో వరంగల్‌కు బయల్దేరారు.
కొత్తపల్లి మండల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు జెండా ఆవిష్కరణ అనంతర ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడ్డం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలను ఆకర్షించడానికి ఎన్నికలలో హామీలు ఇచ్చి హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తుంది అన్నారు.

Leave a Reply