TG | పరకాల మున్సిపల్ ఎన్నికల కన్వీనర్‌గా…

TG | పరకాల మున్సిపల్ ఎన్నికల కన్వీనర్‌గా…
TG | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ గా డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ ను బీజేపీ అధిష్టానం నియామకం చేసింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీజేపీ అధిష్టానం పరకాల మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ గా డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ ను నియామకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ శాఖ పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ ను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పరకాల పురపాలక సంఘం మాజీ కౌన్సిలర్లు బెజ్జంకి పూర్ణాచారి, కొలనుపాక భద్రయ్య, బీజేపీనాయకులు చందుపట్ల రాజేందర్ రెడ్డి, బాసాని సోమరాజు, ఆకుల శ్రీధర్, విడిదొడ్డి నరేష్, ముత్యాల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
