TG | సీనియర్ అసిస్టెంట్‌కు సన్మానం…

TG | సీనియర్ అసిస్టెంట్‌కు సన్మానం…
TG | రామన్నపేట, ఆంధ్రప్రభ : రామన్నపేట తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గాలయ్య జనవరి 26వ తారీకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉద్యోగి సేవ అవార్డుకు ఎంపికయ్యారు. వారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. వీరిని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు నోముల చిరంజీవి ఆధ్వర్యంలో శాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. వీరి వెంట నోముల ప్రవీణ్, నోముల విష్ణు, పెరుమాండ్ల నవీన్, సర్వే సతీష్, చిప్పలపల్లి జితేందర్, నోముల కృష్ణ తదితరులు ఉన్నారు.
