TG | శ్రీనివాస్ రెడ్డికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం.

TG | శ్రీనివాస్ రెడ్డికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం.
TG | గట్టుప్పల, ఆంధ్రప్రభ : మండలంలోని అంతంపేట గ్రామానికి చెందిన ఎన్నారై కుంభం శ్రీనివాస్ రెడ్డిని సోమేశ్వర ఆలయ చైర్మన్ గ్రామస్తులు పూర్ణకుంభంతో ఈరోజు స్వాగతం పలికారు. గ్రామ పరిధిలోని సోమరాజు గూడలో వచ్చేనెల 22,23,24 తేదీలలో జరగనున్న సోమేశ్వరాలయం జాతరకు అన్ని సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. అంతకుముందుకు సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజె (ఐజేయు)జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి, దేవాలయ చైర్మన్ పోతిరెడ్డి రామిరెడ్డి, మాడుగుల నవీన్,రాచమల్ల వెంకటరెడ్డి, పూసపాటి శంకరప్ప, భుజంగం, వీరమల్ల రాజు, పల్లె యాదయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.
