TG | కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు….

TG | కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు….

TG | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఉత్తమ సేవలకు గుర్తింపుగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రభుత్వం విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన పలువురు ఉద్యోగులకు నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ చేతుల మీదుగా పలువురు ఉద్యోగులు ప్రశంస పత్రాలు అందుకుంటున్నారు. నారాయణపేటజిల్లా ఊట్కూర్ తాహసిల్దార్ కార్యాలయంలో సీనియర్ జూనియర్ అసిస్టెంట్ భాస్కర్, ఊట్కూర్ ప్రభుత్వ వైద్యాధికారిని సంతోషి, ఎస్సీ వసతి గృహంలో వర్కర్ గా విధులు చేపడుతున్న కళావతి, అమీన్ పూర్ ఎంపీపీ ఎస్ పాఠశాల ఉపాధ్యాయురాలు భార్గవి, ఊట్కూర్ కు చెందిన విద్యాశాఖలో పనిచేస్తున్న పెద్దింటి శ్రీనివాస్, వైద్య శాఖలో పనిచేస్తున్న సురేష్ కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకోవడంతో పలువురు అభినందిస్తున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందజేయడంతో తమపై బాధ్యత మరింత పెరిగిందని ఉద్యోగులు ఆంధ్రప్రభతో అభిప్రాయపడ్డారు. ప్రజలకు మరింత చేసేందుకు కృషి చేస్తామన్నారు.

Leave a Reply