ఇంటర్ ఫలితాలలో నచ్చన్ ఎల్లాపూర్ గురుకుల

ఇంటర్ ఫలితాలలో నచ్చన్ ఎల్లాపూర్ గురుకుల
కళాశాల విద్యార్థుల ప్రతిభ ఫస్ట్ సెకండ్ ఇయర్ లలో వంద శాతం ఉత్తీర్ణత
కడెం, ఆంధ్రప్రభ: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో గల తెలంగాణ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులు ఆదివారం వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో తమ సత్తా ప్రదర్శించారు.కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా తమ విద్యార్థులు మార్కులుసాధించారని ప్రిన్సిపల్ సిహెచ్ శకుంతల తెలిపారు. కళాశాల నుండి 77 మంది విద్యార్థులు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ పరీక్షలు రాయగా 77 మంది పాసయ్యారని అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లలో కూడా విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారని ఆమె తెలిపారు సెకండ్ ఇయర్ ఎంపీసీ లో కే వంశీక ఒక వెయ్యి మార్కులకు గాను 975 మార్కులు బైపీసీలో డి లలిత వెయ్యి మార్కులకు గాను 971 మార్కులు సాధించారని ఆమె తెలిపారు. ఇంటర్ పరీక్షలలో మంచి మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ శకుంతల నచ్చన్ ఎల్లాపూర్ గ్రామ సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న కళాశాల అధ్యాపకులు పోషకులు అభినందించారు.
