ఆదివాసి సమస్యలపై వినతి పత్రం..

ఆదివాసి సమస్యలపై వినతి పత్రం..

పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమీషనర్ వినతిపత్రం అందజేసిన ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు.
కోవ దౌలత్ రావు మొకాసి

దండేపల్లి, ఆంధ్రప్రభ : హైదరాబాద్ లోని పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యాలయంలో శనివారం ఆదివాసి నాయకులు కుంరం విఠల్ రావు ఆధ్వర్యంలో గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య రాజన్ కలిసి ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి ఆదివాసి నాయకులతో కలిసి పలు ఆదివాసి సమస్యలపై వినతి పత్రాలను అందజేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని నెల్కి వెంకటాపూర్, వందుర్ గూడ గ్రామ పంచాయతీల సమస్య ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన ఆదేశాల ప్రకారం ప్రభుత్వం, లెజిస్లేచర్ దృష్టికి తీసుకెళ్ళి ఒకటే గ్రామ పంచాయతీ నెల్కివెంకటాపూర్ గా కొనసాగేవిధంగా చూడాలని కోరగా గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపినారు.

అదేవిధంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం సివిల్ కోర్టుల పరిధిని ఏజెన్సీ ప్రాంతాలకు కూడా విస్తరిస్తూ జారీ చేసిన జీవోలను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు పరిచే విధంగా చూడాలని కోరగా అక్కడే ఉన్న సంబంధిత అధికారులకు సమస్యలు విన్నవించగా , ప్రక్రియను వేగవంతంగా మొదలు పెట్టాలని ఆదేశించినారు. ఏజెన్సీ ప్రాంతంలో మార్కెటింగ్ తదితర కార్యకలాపాల విషయంలో పిసా చట్టం 1996ను అధికారులు తప్పకుండా పాటించే విధంగా చూసి ఆదేశాలు జారీ చేయాలని కోరినట్లు ఆయన తెలిపినారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పేసా చట్టంకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు చెప్పటం కొరకు ప్రతి ఒక్కరూ సహకరించే విధంగా చూడాలని ఆదివాసి నాయకులను కమీషనర్ కోరినట్లు ఆయన తెలిపినారు. అనంతరం కమిషనర్కు పూల మొక్క అందించి శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెసా కోఆర్డినేటర్ అర్క వసంత్ రావు, వెంకటాపూర్ వందుర్ గూడ గ్రామ పటేల్ మొకాశి బీర్షా , ఆత్రం రాజ శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply