పూలే జీవితాన్ని నేటితరం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి

పూలే జీవితాన్ని నేటితరం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి
చిట్యాల, ఆంధ్రప్రభ :మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలతో ప్రజలు ముందుకు సాగాలని తెలంగాణ మలిదశ ఉద్యమకారులు చిట్యాల మండలం సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పెద్ద కప్పర్తి గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం పిలుపునిచ్చారు.ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నల్లగొండ జిల్ల నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామపంచాయతీ పరిధిలో శనివారం నాడు మహాత్మ జ్యోతి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి సర్పంచ్ కాటం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం సర్పంచ్ కాటం మాట్లాడుతూ ఈరోజు మహిళలు ఉన్నంత చదువులు చదువుకొని జీవితంలో ఉన్న శిఖరాలు అధిరోహిస్తున్నారు అంటే ఆరోజుల్లో పూలే సావిత్రిబాయిని ఉపాధ్యాయురాలుగా పూలే తీర్చిదిద్ది బడుగు బలహీన వర్గాలకు విద్యను నేర్పించడం జరిగిందని సర్పంచ్ కొనియాడారు సమాజంలో సమానత్వం,విద్యా విస్తరణకు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని,. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ప్రస్తుత సమాజానికి మార్గదర్శకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కురు యాదయ్య, జల ప్రశాంత్, సాగర్ నాగరాజు, నూతి వెంకన్న, బుంగపట్ల తిమ్మయ్య, మొర శీను, పున్న వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
