తొర్రూరు టౌన్ ఫోటో బిజెపి కార్యకర్తల బైక్ ర్యాలీ దృశ్యం

తొర్రూరు టౌన్ ఫోటో బిజెపి కార్యకర్తల బైక్ ర్యాలీ దృశ్యం

ఘనంగా బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

బైక్ ర్యాలీ, జెండావిష్కరణ.

తొర్రూరు టౌన్ ఏప్రిల్ 6(ఆంధ్రప్రభ) : భారతీయ జనతాపార్టీ ( బీజేపీ)47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తొర్రూరు రూరల్ మండలంలోని అమ్మాపురం గ్రామంలో బీజేపీ మండలం అద్యక్షుడు గట్టు రాంబాబు ఆద్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక శివాజీ చౌక్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బీజేపీ జెండావిష్కరణ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర పూర్వ కార్యవర్గ సభ్యుడు లేగా రాం మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బీజేపీ జెండా ఎగురవేశారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎందరో కార్యకర్తల,నాయకుల బలిదానాల పునాదులపై నిర్మితమై,ఏకాత్మతా మానవతా వాదం, అంత్యోదయ సిద్దాంతాలు ఆలంబనగా, క్రమశిక్షణ, అకుంఠిత దీక్ష,అంకిత భావానికి, ప్రతిరూపమై, దేశాభివృద్ధి మంత్రంలో నిరంతరం నిమగ్నమై నేడు ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ కార్యకర్తలుగా అందరికీ గర్వ కారణం అని,నవ భారత నిర్మాణం లో ప్రతీ ఒక్కరూ విధిగా భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు.

వాజ్ పాయ్, అద్వానీ ల చేతిలో పురుడోసుకున్న బీజేపీ నేడు నరేంద్ర మోడీ,అమిత్ షా ల సమర్థవంతమైన నాయకత్వం లో ధేశంలో మూడోసారి అధికారంలో కొనసాగుతూ ఇరవై రెండు రాష్ట్రాల్లో బీజేపీ తన మిత్ర పక్షాలతో అధికారం లో కొనసాగుతూ రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సర్వ శక్తులు ఒడ్డి క్రృషి చేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పల్లె కుమార్, అమ్మాపురం గ్రామ ఉప సర్పంచ్ సిరిపాటి విశాల్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు గుండా సురేష్,కార్యక్రమ కన్వనర్ ఊర కేశవ్, వార్డు మెంబర్స్ గంధం యాకమ్మ,పురాణపు బూబా మహేష్,సిరిపాటి స్వామి, కడెం పాండు, కిన్నెర రాజ్ కుమార్,సిరిపాటి మహేష్,ఆకాశ్, గురుస్వామి, భద్రయ్య,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply