ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడం కోసమే వైద్య శిబిరాలు

ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడం కోసమే వైద్య శిబిరాలు
మున్సిపల్ చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ వినయ్ కుమార్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడం కోసమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ వినయ్ కుమార్ లు తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ లోని 9,10,11,19వ వార్డులలోని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మెడికల్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్ ను వైస్ చైర్మన్ వినయ్ కుమార్ తో కలిసి చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
“ప్రజల ఆరోగ్యం మా ప్రథమ ప్రాధాన్యం. ఈ హెల్త్ క్యాంప్ ద్వారా ప్రజలందరికీ అవసరమైన వైద్య సేవలు అందించడమే మా లక్ష్యమని, రాబోయే కొద్ది రోజుల్లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించి, ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు.
ప్రజల సమస్యలను గుర్తించి, తక్షణమే పరిష్కారాలు అందించడం మా లక్ష్యం. ఇలాగే ప్రతి వార్డులో ఆరోగ్య, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజలతో కలిసి ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ దేప రమ్య రాజు, ప్రముఖ వైద్య నిపుణులు డా. సుమన్ కళ్యాణ్, డా. చింతకింది కాటమరాజు, డా సికిలంమెట్ల జయంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

