నూతన కమిటీ ప్రమాణ స్వీకారం..

నూతన కమిటీ ప్రమాణ స్వీకారం..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు పరిధిలోని బార్ అసోసియేషన్ కు ఎన్నికైన నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. అధ్యక్షునిగా కొంతం ప్రసాద్, ఉపాధ్యక్షునిగా రావుల రవీందర్, ప్రధాన కార్యదర్శిగా తోటకూర రాజు, సహాయ కార్యదర్శిగా సుపరి సంపత్ కుమార్, కోశాధికారిగా పారునంది రవికుమార్, క్రీడల కార్యదర్శిగా సామల రమేష్, సాంస్కృతిక కార్యదర్శిగా సీస శ్రీ హర్ష, కార్యవర్గ సభ్యులుగా మొరిగాడి కృష్ణ, పూల కురుమూర్తి, లోకేశ్వరి, సంగీత, పల్వార్, ఆసిఫా, మొబైన్ ప్రమాణ స్వీకారం చేశారు.

నూతన బాధ్యులకు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, సన్మానించి అభినందనలు తెలిపారు.న్యాయవాదుల రక్షణ కోసం అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు తెచ్చి అమలు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. తనను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు న్యాయవాదులకు ధన్యవాదాలు చెబుతూ కోర్టు భవన నిర్మాణానికి శాయశక్తులా పాటుపడతానని తెలిపారు.నూతన అధ్యక్షులు వెంకట ప్రసాద్ చెప్పారు. ఎన్నికల అధికారి వనం రాజు నూతన బాధ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన బాధ్యులను ఘనంగా శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అధ్యక్షులు జూకంటి రవీందర్,గొట్టిపాముల బాబూరావు,సీస శ్రీనివాస్, ఏజిపి హరిబాబు పలువురు న్యాయ వాదులు పాల్గొన్నారు.

Leave a Reply