TG | మాటలకే పరిమితం.. పనులు శూన్యం

TG | మాటలకే పరిమితం.. పనులు శూన్యం

  • మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

TG | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఇప్పటివరకు ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఈ రోజు పరకాల పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చెప్పేది ఒకటి, చేసేది మరొటని, వారి పాలన మొత్తం అసత్య ప్రచారాలు, మోసాల పునాదుల మీద నడుస్తోందని ధ్వజమెత్తారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తయిన అభివృద్ధి పనులకు రంగులు వేసి మళ్లీ ప్రారంభాలు చేయడమే కాంగ్రెస్ పాలనకు పరాకాష్ట అన్నారు. మా ప్రభుత్వంలో వేసిన శిలాపలకలను ధ్వంసం చేసి కొత్తవి పెట్టి శంకుస్థాపనలు చేయడం తప్ప, పరకాలలో కొత్తగా మంజూరైన అభివృద్ధి పనులు ఒక్కటైనా లేవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చందుపట్ల నరసింహారెడ్డి, మాజీ కౌన్సిలర్లు పాలకుర్తి గోపి, శనిగరం రజిని నవీన్, దామర మొగిలి, నాయకులు పంచగిరి శ్రీనివాస్, ఎండి షబ్బీర్ అలీ, యూత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply