ఆదర్శ గ్రామమే లక్ష్యం..

ఆదర్శ గ్రామమే లక్ష్యం..

  • నెన్నెలలో ముమ్మరంగా సాగుతున్న 99 రోజుల ప్రణాళిక
  • శానిటేషన్, పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి

నెన్నెల, ఆంధ్రప్రభ : నెన్నెల మండల కేంద్రమైన నెన్నెలను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ’99 రోజుల ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. బుధవారం గ్రామ సర్పంచ్ ఎండి. ఇబ్రహీం ఆధ్వర్యంలో గ్రామంలో పలు అభివృద్ధి, పారిశుధ్య పనులను నిర్వహించారు. గ్రామ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వీధుల్లోని చెత్తాచెదారాన్ని తొలగించి, మురికి కాలువలను శుభ్రపరిచారు. అలాగే వీధి దీపాల మరమ్మతులు చేపట్టడంతో పాటు, హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నీరు పోశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. నెన్నెల గ్రామాన్ని పచ్చదనం, పరిశుభ్రతతో పాటు ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో నెన్నెలను జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా నిలపడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కీసరి సంతోష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేష్, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొని పనుల్లో సహకరించారు.
ఫోటో రైటప్: 99 రోజుల ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో సర్పంచ్ ఎండి. ఇబ్రహీం

Leave a Reply