TG | 615 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

మ‌హ‌రాష్ట్ర‌కు రెండు లారీల‌లో త‌రలింపు
చెన్నూరు చెక్ పోస్ట్ వ‌ద్ద త‌నిఖీలు
లారీలు సీజ్ , డ్రైవ‌ర్లు అరెస్ట్

చెన్నూర్ ఆంధ్రప్రభ; అక్ర‌మంగా రవాణా చేస్తున్న 615 క్వింటాళ్ల రేష‌న్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ అధికారులు ప‌ట్టుకున్నారు. చిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణ సమీప జాతీయ రహదారి నుంచి మహారాష్ట్రకు రెండు లారీల ద్వారా తరలిస్తుండ‌గా హైదరాబాద్ సివిల్ సప్లయ్, టాస్క ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు.. ఈ రెండు లారీల‌లో సుమారు 615 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఈ లారీల‌ను న‌డుపుతున్న డైవ‌ర్ల‌ను అదుపులోకి తీసుకున్నారు. లారీల‌ను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు..

Leave a Reply