శ్రీ సువర్చలాసహిత ఆంజనేయస్వామి వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వానం

శ్రీ సువర్చలాసహిత ఆంజనేయస్వామి వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వానం
పరకాల, ఆంధ్రప్రభ): పరకాల మండలం మల్లక్కపేట శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సువర్చలాసహిత ఆంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు, ఎక్స్ అఫీషియో మెంబర్ కాటూరి జగన్నాథచార్యులు తెలిపారు. శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో తేది 2-4-2026 గురువారం రోజున మధ్యాహ్నం 1-00 లకు శ్రీ సువర్చలాసహిత ఆంజనేయస్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించడం జరుగుతుందని,
గురువారం ఉదయం హనుమత్ హోమం, పూర్ణాహుతి, 108 కలశాలతో స్వామి వారికి అభిషేకం, సువర్చలాసహిత ఆంజనేయస్వామి వారి కళ్యాణ మహోత్సవం, తీర్థ ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని,
సాయంత్రం 6-00 గం॥లకు బండ్లు తిరుగుట, జాతర మరియు భజన కార్యక్రమాలు,
కళ్యాణ మహోత్సవములలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారి కళ్యాణమును తిలకించి, తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ చైర్మన్ అంబిరు మహేందర్, అర్చకులు జగన్నాథచార్యులు కోరారు.
