TG | సమష్టి కృషితో జిల్లాను అభివృద్ధి సాధ్యం

TG | సమష్టి కృషితో జిల్లాను అభివృద్ధి సాధ్యం
- భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
- ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
TG | ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి : ప్రతి భారతీయుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం కల్పించే గొప్ప రాజ్యాంగం మనదని, మహనీయులను స్మరించుకుంటూ, అభివృద్ధిలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాను ముందుకు తీసుకువెళ్లేందుకు మనం అందరం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 77 వ గణతంత్ర దినోత్సవంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్క రించి గీతాలాపన చేశారు.
జిల్లా ఎస్పీ సంకీర్త్ తో కలిసి కలెక్టర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతిని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉత్తమ అధికారులకు ప్రశంశ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, జిల్లా అదనపు కలెక్టర్ లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, అదనపు ఎస్పీ నరేష్ కుమార్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, ఆర్డీఐ మెంబర్ సుంకరి రామచంద్ర మూర్తి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
