రఘురామ దాస భజన కీర్తనల పుస్తక ఆవిష్కరణ..

రఘురామ దాస భజన కీర్తనల పుస్తక ఆవిష్కరణ..
నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ : ఆద్యాత్మిక భజన పాట, మాట శాంతి, రాజనీతి భావాలను తన రచనలలో ప్రతిబింబిస్తూ పుస్తకాలను రచిస్తున్న కవి పండితులు కర్నాటి రఘురాములు గౌడని పలువురు వక్తలు కొనియాడారు. సోమవారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో జాతీయోన్నత పాఠశాలలో. రఘురాములగౌడ్ రచించిన “రఘు రామదాసు భజన కీర్తనలు” పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి తాలూకాలోని గుండ్లగంట పల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాద్యాయులు కవి పండితుడు భజనపరులు రఘురాములు గౌడ్ ఉపాద్యాయ వృత్తి చేస్తూనే దాదాపు నలబై సంవత్సరాలుగా ఆద్యాత్మిక పరమైన అంశాలు దేవుళ్లు గురువులు సామాజిక అంశాలు రాజనీతి తదితర అంశాలపై ఇప్పటివరకు ముప్పైమూడు పుస్తకాలను ఆవిష్కరించారని పుస్తకాలలో ఉన్న సొరాంశం శాంతి,భక్తి ముక్తి మార్గంలో ప్రయాణం చేయాలని,మానవుల మధ్య తీవ్ర అసమానతలు ఉన్నంతరకు భారతదేశం పురోగమించదని,యువతరానికి సంస్కార వంతమైన మార్గాన్ని చూయించాలని సమాజంలో ఉన్న అనేక రుగ్మతలు పోవాలని అంతరరాలు లేకుండా జీవించాలని సమధర్మం ఆయన రచనలలో కన్పిస్తుందని వక్తలు అన్నారు. సాహిత్య పరులు కవులు భజనకీర్తన రచనలు చేసేవారు రఘురాములు గౌడ ఆదర్శంతో ముందుకు సాగాలని కోరారు. నెలపొడుపు కవులు రచయిత కర్నాటి రఘురాములు గౌడ్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అద్యక్షులు వనపట్ల సుబ్బయ్య,కందికొండ మోహన్, వహీద్ ఖాన్ ,ఎదిరెపల్లి కాశన్న,జిల్లా నాటకసమాజం అద్యక్షులు ఆర్ సత్యం,కందనూల్ కళాసేవా సమితి గౌరవ అద్యక్షుడు డి.రాములు, నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు
