సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం..

సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం..
కొత్తగూడ, ఆంధ్రప్రభ : పేద మధ్య తరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్ ) ఒక వరమని కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు సుంకరబోయిన మొగిలి, జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ రూప్ సింగ్ లు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా,వైద్యం, వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. పేద మధ్య తరగతి ప్రజలకు ప్రజా ప్రభుత్వం సిఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక భరోసాను కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఇర్ఫ రాజేశ్వర్ రావు, మల్లెల రణధీర్, లావణ్య వెంకన్న, బిట్ల శ్రీనివాస్,ఓబిసి నాయకులు వల్లపు రంజిత్,ప్రశాంత్, ఉపేంద్ర చారి,కాడబోయిన జంపయ్య, ముస్మి సర్పంచ్ బానోత్ దేవేందర్, యాదగిరి కిరణ్ కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.
