రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు..

రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు..

వదంతులను నమ్మవద్దు
సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

మేడ్చల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, సోషల్ మీడియాలో ప్రచారంలో వస్తున్న వదంతుల వల్ల ప్రజలు ఆందోళనకు గురై ఒకేసారి పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు వెళ్లి వాహనాల్లో ఫుల్ ట్యాంక్ నింపించుకుంటున్నారని తెలిపారు. దీంతో అనవసర రద్దీ ఏర్పడి సరఫరా వ్యవస్థకు అంతరాయం కలుగుతున్నదని పేర్కొన్నారు. నిన్న ఒక్కరోజే 1500 పెట్రోలు, డీజిల్ ట్యాంకర్లు బంకులకు పంపిణీ చేశామని తెలిపారు.సుమారు 20 వేల కిలో లీటర్ల పెట్రోలు అందుబాటులో ఉంది. రోజువారి అవసరాలకు సరిపడా పెట్రోలు డీజిల్ నిల్వలు ఆయిల్ కంపెనీల వద్ద ఉన్నాయి.. అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరా నిరంతరంగా కొనసాగుతున్నదని చెప్పారు. ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు. ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని, అలా చేయడం వల్ల ఇతరులకు ఇబ్బందులు కలుగుతాయని సూచించారు.

Leave a Reply