కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా…

కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా…

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు…
కార్యకర్తల హక్కుల కాపాడకపొతే పార్టీ ఎందుకు…?
మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి.

జగిత్యాల, ఆంధ్రప్రభ : సీనియర్ నేత, మాజీ మంత్రిజీవన్ రెడ్డి బుధవారం కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఏఐసిసి సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖను కాంగ్రెస్ అధిష్టానానికి పంపించారు. బుధవారం జగిత్యాల పట్టణంలోని బండారి గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేశారు. కార్యకర్తల హక్కుల కాపాడకపొతే పార్టీ ఎందుకని ప్రశ్నించారు. కార్యకర్తలను తొక్కుకుంటూ సీఎం అయిన రేవంత్ రెడ్డి పతనం జగిత్యాల నుండి ప్రారంభం అవుతుందన్నారు. 43 ఏళ్ల కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకోవడం బాధగా ఉందని, విధి లేని పరిస్థితిల్లో కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Leave a Reply