శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర పోస్టర్ ఆవిష్కరణ..

శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర పోస్టర్ ఆవిష్కరణ..

ఏప్రిల్ 2 రోజున శఖటోత్సవం
ఏప్రిల్ 3 రాత్రి స్వామి వారి రథోత్సవం

బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల(జాతర) పోస్టర్‌ను మానకొండూరు శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఎస్సి సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. జాతర మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జెల్ల ప్రభాకర్, బెజ్జంకి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్, మండల అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ఆలయ పూజారి శేషమధుసూదనచారి, డైరెక్టర్లు బెజుగాం ప్రసాద్, గుబిరే చంద్రం, పొట్లపల్లి ప్రభాకర్, బోనాల మల్లేశం, మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య, పురుమ నారాయణరెడ్డి, ఐలేని మహేందర్ రెడ్డి, బుట్ల చంద్రప్రకాశ్, ఇస్కిల్లా ఐలయ్య, బోనగిరి శ్రీనివాస్, కొండ్ల ప్రకాష్, జంగిటి శంకర్, దొమ్మటి శ్రీహరి తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply