ఆలయంలో రచ్చ రవి సందడి..

ఆలయంలో రచ్చ రవి సందడి..
వరంగల్, ఆంధ్రప్రభ : వరంగల్ నగరంలోని భద్రకాళి ఆలయంలో ప్రముఖ నటుడు రచ్చ రవి సందడి చేశారు. బలగం సినిమాతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రవి, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను వరంగల్ వాసిగా ఉండటం ఎంతో గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ తనకు ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవల సిద్దిపేటలో షూటింగ్ నిమిత్తం వెళ్లిన తాను, అక్కడి నుంచి ప్రత్యేకంగా వరంగల్‌కు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. తాను ఎప్పుడైనా సినిమా షూటింగ్‌ల కోసం బయటకు వెళ్లినా, తిరిగి వచ్చినప్పుడు తప్పకుండా భద్రకాళి ఆలయాన్ని దర్శించుకోవడం తనకు ఆనవాయితీగా మారిందని చెప్పారు. తన తల్లిదండ్రులు కూడా వరంగల్‌లోనే నివసిస్తున్నారని, వారిని కలిసేందుకు వచ్చిన ప్రతిసారి అమ్మవారిని దర్శించుకుని తన కోరికలను విన్నవించుకుంటానని వెల్లడించారు. రచ్చ రవి ఆలయానికి రావడంతో భక్తులు ఆయనతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపగా, ఆలయ ప్రాంగణం కొంతసేపు సందడిగా మారింది.
