​మతం మారితే ఎస్సీ రిజర్వేషన్లు రద్దు..

​మతం మారితే ఎస్సీ రిజర్వేషన్లు రద్దు..

చిట్యాల, ఆంధ్రప్రభ : మతమార్పిడి చేసుకున్న దళితుల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తులు షెడ్యూల్డ్ కులాలకు లభించే ప్రయోజనాలను పొందలేరని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కేవలం హిందూ, బౌద్ధ, సిక్కు మతాల్లోని వారు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులు అని స్పష్టం చేసింది. క్రైస్తవ మతంలో కుల వివక్ష లేదా కుల వ్యవస్థకు తావు లేదని, అందుకే ఆ మతంలోకి మారిన వారికి ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవని కోర్టు తేల్చి చెప్పింది. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ ఈ నిర్ణయాన్ని వెలువరించింది. మతం మారిన తర్వాత కూడా పాత కుల ధృవీకరణ పత్రాలను చెల్లదని ఈ తీర్పు ద్వారా స్పష్టమైంది.

Leave a Reply