TG | వైభవంగా శ్రీ గట్టు తిమ్మప్ప స్వామి బ్రహ్మోత్సవాలు

TG | వైభవంగా శ్రీ గట్టు తిమ్మప్ప స్వామి బ్రహ్మోత్సవాలు

TG | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని మహద్వార్ గ్రామ శివారులో వెలసిన శ్రీ గట్టు తిమ్మప్ప స్వామి (శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి )వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రథసప్తమి సందర్భంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీ గట్టు తిమ్మప్ప స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరైన మంత్రికి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి పట్టు వస్త్రాలు తలపై ఉంచుకొని భాజాభజంత్రీల మధ్య స్వామి వారి దేవాలయానికి గుట్టపై చెరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మంత్రి శ్రీహరి లలితా దంపతులు పట్టు వస్త్రాలను ఆలయం కమిటీ సభ్యులకు అందజేశారు. స్వామివారికి దర్శించుకున్న మంత్రి వాకిట శ్రీవారిని ఆలయ ధర్మకర్తలు వైష్ణవం ప్రహ్లద్, వైష్టవం సురెందర్ తీర్తప్రసాదాలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహాద్వార్ గ్రామ సర్పంచ్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు రాజేశ్వరరావు ,సంతోష్ రెడ్డి,సత్యనారాయణ, బి. శంకర్, వడ్ల బాలరాజ్, కాంగ్రెస్ నాయకులు బోయ రవికుమార్, రాయికోడ్ ఆనంద్, వాకిటి హన్మంతు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply