ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు..

ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు..

భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసిన కార్పొరేటర్ పల్లం పద్మ

కరీమాబాద్ , ఆంధ్రప్రభ : నవ్వుతు ఉరికంబాన్ని ముద్ధాడిన స్వాతంత్ర సమరయోధుడు , అమరజీవి భగత్ సింగ్ 95వ వర్ధంతి భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 32వ డివిజన్ లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా 32 వ డివిజన్ కార్పొరేటర్ పల్లం పద్మ-రవి మాట్లాడుతూ ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు. ఇంక్విలాబ్ జిందాబాద్! విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే. మతాతీత రాజకీయాలకు దూరంగా భారతదేశం పురోగతి సాధించాలి అని కళలు కని తన ప్రాణాన్ని తృణప్రాయంగా సమర్పించిన భగత్ సింగ్ కల నేటికీ కల గానే మిగిలిందనీ ఆమె అన్నారు. సామాజిక పురోగతి ఏ కొందరి ప్రతిష్టలపై కాక ప్రజాస్వామ్య ప్రగతిపై ఆధారపడి ఉంటుంది.

సామాజిక, రాజకీయ , వ్యక్తిగత జీవితంలో సమ ప్రాధాన్యత కల్పించడం ద్వారానే విశ్వజనీన సహోదరత్వం సాధ్యమవుతుంది” అని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సందీప్, నాయకులు ఆడెపు బిక్షపతి, సామల సుధాకర్, బొంబాల అంబేద్కర్, బత్తుల కుమార్, పత్తిపాక రాజేందర్,యెగ్గని మల్లికార్జున్ , చిలువేరు రవీందర్, పరదేశి రాజేష్, కొండా రాజు, కొండా సూరి, నీలం వినీత్, బుధరపు హరి, వెల్ది శివమూర్తి , పల్లం హరిష్ , యుగేంధర్, మారపాక శ్రీను, బ్రహ్మం, సామల సత్యం, ప్రభు సాగర్, ప్రతాప్, డాక్టర్ రాజమొగిళి, పెట్టేం మొగిలి, రాజమణి,మండల గౌరమ్మ, సరస్వతి, రాధికా, స్వప్న, పద్మ, కార్యకర్తలు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply