అక్రమ అరెస్టులతో ఉద్యమాన్నిఆపలేరు..

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్నిఆపలేరు..

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. వెన్నంపల్లి పాపయ్య

రేగొండ, ఆంధ్రప్రభ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ యావత్ ప్రజానీకాన్ని మోసం చేసి గద్దెనెక్కి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మోసానికి గురి చేస్తున్న రేవంత్ సర్కార్ మెడలు వంచే దిశగా చలో అసెంబ్లీ ముట్టడికి సోమవారం పిలుపునివ్వడం జరిగింది.ఆదివారం రాత్రి ముందస్తుగా రేగొండ పోలీసులు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపయ్య, బిజెపి రేగొండ మండల అధ్యక్షులు. బండి శ్రీనివాస్, భాగిర్తిపేట సర్పంచ్ పేరుమాండ్ల శ్రీలత – తిరుపతి గౌడ్ బీజేపీ నాయకుల ఇండ్ల వద్దకు చేరుకొని అక్రమ అరెస్ట్ చేసి రేగొండ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళారు.

ఈ సందర్బంగా పాపయ్య మాట్లాడుతూ.. లాటీలు తూటాలు ఉద్యమాన్ని ఆపలేవు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధికార దిశగా పోరాటం చేస్తామని ఎన్ని కేసులు అయినా ఎన్ని అరెస్టులైన ఈ ధర్మపోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పోలుసాని తిరుపతిరావు, జిల్లా నాయకులు. నారాయణరెడ్డి, మెతుకుపల్లి బుచ్చిరెడ్డి, బండారి రవి, జాలిగపు రాజయ్య , లింగారెడ్డి, ఉప సర్పంచ్లు మోహన్ నాయక్,రాజశేఖర్, రమేష్ ,శ్రీధర్,నాయకులు.రాజేందర్ నాయక్, రాకేష్, రఘు, కుమారస్వామి, విక్రమ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply