TG | మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం..

TG | మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం..
- జనసేన పార్టీ ఇంచార్జ్ సంపత్
TG | లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ : వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు అన్ని స్థానాల్లో పోటీ చేసి తమ సత్తా చాటుతారని ఆ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంతెన సంపత్ ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో తెలంగాణలోని అన్ని జిల్లాలోని మున్సిపాలిటీల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందన్నారు.
జనసేన పార్టీ ప్రజా శ్రేయస్సు కోసం నిత్యం పనిచేస్తోందని వివరించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ సిద్ధాంతాలు పని చేస్తాయని తెలిపారు. కులాలను కలిపి, మతాల ప్రస్తావన లేని సమాజం కోసం జనసేన పని చేస్తోందన్నారు. జాతీయ వాదం, పర్యావరణ పరిరక్షణలకు అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. ముఖ్యంగా యువత అధిక సంఖ్యలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
అనంతరం పలువురికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ ఆడహాక్ కమిటీ మెంబర్ మాయ రమేష్, రాష్ట్ర విద్యార్థి విభాగం నాయకులు సాగర్, అప్పని రక్షిత్ వర్మ, నాయకులు బియ్యాల దినేష్, అజ్మీరా సాయి, ప్రవీణ్, అవునూరి కిరణ్, శేఖర్, తన్నీరు సాయి తదితరులు పాల్గొన్నారు.
