TG | కట్టు కాలువ ధ్వంసం..

TG | కట్టు కాలువ ధ్వంసం..

  • జిఎంఆర్ సిబ్బంది నిర్లక్ష్యం
  • పంట పొలాల్లోకి వెళ్ళని సాగునీరు
  • అధికారుల దృష్టికి కాలువ సమస్య
  • మరమ్మతులు చేయాలని రైతుల డిమాండ్

TG | బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న కట్టు కాలువను జీఎంఆర్ సిబ్బంది ధ్వంసం చేశారు. దీంతో కట్టు కాలువ ద్వారా పంట పొలాల్లోకి వెళ్లే నీరు పక్కదారి పడుతున్నాయి. ఇట్టి విషయాన్ని పలువురు రైతులు జీఎంఆర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జీఎంఆర్ సిబ్బంది జాతీయ రహదారి రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టారు.

పక్కన ఉన్న కట్టు కాలువలోకి మట్టితో పాటు కంకర వేయడంతో పూర్తిగా కూడుకుపోయింది. అంతేకాకుండా అట్టి ప్రాంతంలో పలువురు ప్రమాదాలకు గురి అవుతున్నారు. ఇట్టి విషయాన్ని పట్టణ సచివాలయ కార్యదర్శి మహేష్ గౌడ్, ఉప సర్పంచ్ మోహన్ రెడ్డితో పాటు పలువురు రైతులు ధ్వంసమైన కట్టు కాలువను పరిశీలించారు.

ఇట్టి విషయాన్ని వారు జిఎంఆర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇట్టి సమస్య ఇప్పటివరకు తమ దృష్టికి రాలేదని అధికారులు సమాధానం చెప్పారు. వెంటనే కట్టు కాలువ మరమ్మత్తు పనులు చేపట్టాలని వారు అధికారులకు సూచించారు. రైతు ఇబ్బందులను గుర్తించాలని తెలిపారు. కట్టు కాలువ ద్వారా మండలంలోని కాచాపూర్ గ్రామ రైతులకు సాగునీరు వెళ్తుందని వారు చెప్పారు. ప్రస్తుతం కట్టు కాలువ మట్టితో నిండిపోవడంతో రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply