పంచాయతీ కార్మికుని మృతి బాధాకరం

పంచాయతీ కార్మికుని మృతి బాధాకరం
అంత్యక్రియలకు డబ్బులు అందజేత
జుక్కల్ (కామారెడ్డి), అందప్రభ : జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ కార్మికుడు జి.కిషన్ అనారోగ్యంతో మృతి చెందారు.ఈవిషయం తెలుసుకున్న బస్వాపూర్ గ్రామ ఉపసర్పంచ్ బొర్కర్ అనిల్, సర్పంచ్ భర్త సురేష్ గొండ వార్డు సభ్యులతో కల్సి మృతిచెందిన పంచాయతీ కార్మికుని ఇంటికెళ్లి తమ ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని వ్యక్తిపరిచారు.కుటుంబ సభ్యులకు ధైర్యాన్నిఇచ్చారు. అంత్యక్రియల కోసం పదివేల రూపాయలు కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుడు కిషన్ పచ్చదనం పరిశుభ్రత కోసం గ్రామంలో పాటుపడడమే కాకుండా నిస్వార్ధంగా గ్రామ ప్రజలకు సేవలు అందించడం జరిగిందని,ఆయన మృతి బాధాకరమని వారన్నారు.
