స్వయం ఉపాధి రంగాలలో మహిళలు రాణించాలి..

స్వయం ఉపాధి రంగాలలో మహిళలు రాణించాలి..
నర్సంపేట, ఆంధ్రప్రభ : స్వయం ఉపాధి రంగాలలో మహిళలు రాణించాలని నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ అన్నారు. నర్సంపేట పట్టణం 3వ వార్డు పరిధిలోని స్వయంకృషి (ఎస్ఎల్ ఎఫ్) మహిళా సంఘం సభ్యుల ఆహ్వానం మేరకు బుధవారం మహిళా సాధికారత కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ , పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.ఈ సందర్భం గా మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి వంటి పథకాలపై,వడ్డీ లేని రుణాల గురించి వివరించారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని, పొదుపుతో పాటు స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలని, మహిళా సంఘాలను బలోపేతం చేసుకోవాలని పిలుపు నిచ్చారు.
మహిళా సంఘ సభ్యుల కోరిక మేరకు అడిగిన మహిళా బిల్డింగ్ ను అతి త్వరలోనే శాసనసభ్యులు మాధవ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి కావాల్సిన నిధులను మంజూరు చేయిస్తారని హామీ ఇచ్చారు. మహిళా సంఘం సభ్యులు మున్సిపల్ చైర్మన్‌ను, కౌన్సిలర్లను శాలువాతో ఘనంగా సత్కరించి, ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు బహుమతి అందజేశారు.ఈ కార్య క్రమంలో 3 వార్డు కౌన్సిలర్ ముత్తినేని వెంకన్న,4వ వార్డు కౌన్సిలర్ బీరం భరత్ రెడ్డి, 5వ వార్డు కౌన్సిలర్ పొన్నాల మనీషా ప్రకాష్, ఎస్ఎల్ఎఫ్ మహిళా సంఘ సభ్యులు, 3వ వార్డు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
