TG | కుటుంబంలో చిచ్చు పెట్టిన రాజకీయం

TG | కుటుంబంలో చిచ్చు పెట్టిన రాజకీయం
- పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరిన తమ్ముడు సురభి కుమార్ గౌడ్
- బస్తీమే సవాల్ అంటున్న అన్న తమ్ముల్లు
TG | గుమ్మడిదల, ఆంధ్రప్రభ : గుమ్మడిదల మున్సిపల్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు సొంత అన్నా తమ్ముడు గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో సేవలు అందిస్తూ ఉన్నారు. అలాంటి అన్న తమ్ములు గొడవకు దిగి రాజకీయంగా విడిపోయి శత్రువులుగా మారారు. గుమ్మడిదల మున్సిపల్ లోని బొంతపల్లి వార్డుకు చేందిన సురభి నాగేందర్ గౌడ్, సురభి కుమార్ గౌడ్ లు సొంత అన్న తమ్ముళ్లు ఇరువురు కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని సంవత్సరాలుగా సేవలు అందిస్తూ వస్తున్నారు.
సీనియర్ నాయకులుగా ఉన్న ఇరువురి రాజకీయ నేపథ్యంలో మున్సిపల్ లో కౌన్సిలర్ టికెట్ కోసం వాగ్వాదానికి దిగి గల్లలు పట్టుకున్నారు. ప్రతి సారి ఎన్నికలు వచ్చినప్పుడల్లా అన్నకే టికెట్ కేటాయించడం పట్ల అసంతృప్తి చెందిన తమ్ముడు సురభి నాగేందర్ గౌడ్ విసిగిపోయి పార్టీ మారాలని నిర్ణయించుకున్నాడు. కాంగ్రెస్ ను వీడీ మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సురభి కుమార్ గౌడ్, పొల్యూషన్ వ్యతిరేక కమిటీ చైర్మన్ రాజు తదితరులతో బీఆర్ఎస్ లో చేరారు..
