పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా జీవిద్దాం..

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా జీవిద్దాం..

సిబ్బందితో బ్లీచింగ్ పౌడర్ చల్లింపుని పర్యవేక్షించిన 8వార్డు మెంబెర్ మేడి హరికృష్ణ

చిట్యాల, ఆంధ్రప్రభ : వట్టిమర్తి గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 8వార్డులో పారిశుద్ధ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు వార్డు సభ్యుడు మేడి హరికృష్ణ తెలిపారు. గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి వార్డులో బ్లీచింగ్ పౌడర్ చల్లించే పనులను ఆయన ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మేడి హరికృష్ణ మాట్లాడుతూ వార్డులో ఎటువంటి పారిశుద్ధ సమస్యలు ఉన్న వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవసరమైన పనుల కోసం గ్రామ సర్పంచి మరియు ఉపసర్పంచ్ గారితో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. గ్రామ ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం లక్ష్యంగా పనిచేస్తున్నానని, ఎనిమిదో వార్డ్ ను ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని మేడి హరికృష్ణ పేర్కొన్నారు.

Leave a Reply