రైతుల్లో తీవ్ర ఆందోళన..

రైతుల్లో తీవ్ర ఆందోళన..
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో జాప్యం – రైతులు నష్టాల్లో
బెజ్జంకి, ఆంధ్రప్రభ : మొక్కజొన్న పంట మార్కెట్లకు రావడం ప్రారంభమై ఇప్పటికే 15 రోజులు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం రైతుల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోందనీ బి.ఆర్.ఎస్ యువ నేత ముక్కిస అంజి రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు… మొక్కజొన్నకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 2400 ఉన్నప్పటికీ, కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ప్రైవేట్ మార్కెట్లో దళారులకు రూ. 1600 నుంచి 1700లకే అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు.
ఇదే సమయంలో అకాల వర్షాలు కూడా రైతులను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయని వాపోయారు. పంటను నిల్వ ఉంచుకునే పరిస్థితులు లేకపోవడంతో, తక్కువ ధరలకు విక్రయించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.”ఈ ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుందా? లేక దళారులకు మేలు చేస్తుందా?” అంటూ ఆయన ప్రశ్నించారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
