కుటుంబానికి రూ.2 లక్షల చెక్కు అందజేత..

కుటుంబానికి రూ.2 లక్షల చెక్కు అందజేత..

ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి యోజనతో ఆర్థిక భరోసా
తక్కువ ప్రీమియంతో పెద్ద భద్రత
అర్హులు తప్పక పథకంలో చేరాలని బ్యాంక్ అధికారులు సూచన

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : చిన్న మొత్తంలో ప్రీమియంతో పెద్ద మొత్తంలో రక్షణ కల్పించే ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వంటి పథకాలు ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తాయని బ్యాంక్ అధికారులు తెలిపారు,అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకంలో చేరాలని సూచించారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన కక్కెర్ల రాజు (40), తండ్రి సాంబయ్య కుటుంబానికి ఈ పథకం ద్వారా బీమా సాయం అందింది,ఆయన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నల్లబెల్లి బ్రాంచ్‌లో సంవత్సరానికి రూ.436 చెల్లిస్తూ బీమా పొందుతూ ఉండగా,నిబంధనల ప్రకారం రూ.2,00,000 చెక్కును నామిని కక్కర్ల శంకర్ దేవికి అందజేశారు,ఈ చెక్కును వరంగల్ యూనియన్ బ్యాంక్ డిప్యూటీ రీజినల్ హెడ్ శ్రీరామ్,నల్లబెల్లి బ్రాంచ్ మేనేజర్ నాగేష్,సబ్ మేనేజర్ వెంకట్ చేతుల మీదుగా అందజేశారు,ఈ కార్యక్రమంలో నవీన్ రెడ్డి, క్యాషియర్ రామకృష్ణ,బ్యాంక్ మిత్ర అడ్డగట్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply