పత్తాలేని పశు వైద్యశాల డాక్టర్, సిబ్బంది..

పత్తాలేని పశు వైద్యశాల డాక్టర్, సిబ్బంది..

పశువులకు వ్యాక్సిన్లు వేస్తున్నామన్న పేరుతో విధుల డుమ్మా

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలోని పశు వైద్యశాలలో డాక్టర్, సిబ్బంది అందుబాటు లేకపోవడంతో రైతులు, పశువుల పెంపకదారులు ఆస్పత్రి ఎదుట పడిగాపులు కాస్తున్నారు. బుధవారం రోజు 12:30 గంటల సమయం అవుతున్న పశు వైద్యశాలను తెరవకపోవడంతో రైతులు, పశువుల పెంపకదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల వర్ష సూచన వాతావరణ పరిస్థితుల వల్ల పశువులు రోగాల బారిన పడడం జరుగుతుంది. రైతులు వ్యవసాయ ఎడ్లను, పశు పెంపకదారులు ఆవులు, బర్రెలు, కుక్కలను చికిత్స నిమిత్తం పట్టణంలోని పశు వైద్యశాలకు తీసుకురావడం జరుగుతుంది. గత రెండు రోజుల నుండి పశు వైద్యశాలలో ఎవరు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల ఆస్పత్రి ఎదుట చెట్ల కింద పడిగాపులు కాస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరును రైతులు, పశువుల పెంపకదారులు తప్పు పడుతున్నారు. సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నత అధికారులు స్పందించి పశు వైద్యశాలలో డాక్టర్, సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Leave a Reply