మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ..

మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ..
పరకాల, ఆంధ్రప్రభ : కుట్టు మిషన్ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పరకాల పట్టణంలోని 12వ వార్డు ఆకుల వాడ లో గత సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన సిరి స్వచ్ఛంద సంస్థ ద్వారా మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం శిక్షణను సంస్థ డైరెక్టర్ డాక్టర్ పరికి సుధాకర్ ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా పరకాల పురపాలక సంఘం 12వ వార్డు కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్ హాజరై వారి చేతుల మీదుగా శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ శిక్షణ పూర్తి చేసిన మహిళలు తమ వంతు కుట్టు అల్లికలను నేర్చుకొని వారి వారి కుటుంబాలకు ఆర్థికంగా ఎదగాలని సంస్థ డైరెక్టర్ డాక్టర్ పరికి సుధాకర్ కోరారు.12 వ వార్డు కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్ మాట్లాడుతూ మహిళలకు ఎంతగానో ఉపాధి కల్పించిన సంస్థను అభినందించారు. అదేవిధంగా 12 వ వార్డులో ఏర్పాటు చేసిన ఈ కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని మిగతా అన్ని ప్రాంతాల్లో పెట్టాలని సూచించారు. ఈ ఈ కార్యక్రమంలో టీచర్ తులసి, గట్టు అశోక్ ,గట్టు అరుణ ,లావణ్య, దీపిక, కవిత, విజయ్ కుమారి ,రజిత, లావణ్య, రమ్య, శిరీష తదితరులు పాల్గొన్నారు.
