నిధులు మంజూరు చేయాలి..

నిధులు మంజూరు చేయాలి..
సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : కొమరం భీ0 అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు )మండలంలోని బాండేర్ పంచాయతీలోని రుద్ద కస కోలాం గిరిజన గ్రామంలో మౌలిక వసతుల కోసం సీసీడీపీ ద్వారా నిధులు మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం ఉట్నూర్ కార్యాలయంలో ఐటీడీఏ పివిటిజి ఏపీవో ఆత్రం భాస్కర్ కు కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు బాండేర్ పంచాయతీసర్పంచ్ కుమ్ర భీమ్రావు తెలిపారు. కొ లం గిరిజనుల కోసం రుద్ధకస గ్రామంలో మంచినీటి వసతి కోసం నూతన బోర్ వెల్,గ్రామంలో సిసి రోడ్, రుద్దకస నుండి బాండేర్ వరకు రోడ్డు నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. పివిటిసి ఎపిఓ ఇటీవల నూతన బాధ్యతలు చేపట్టడంతో ఆయనకు శాలువాతో సత్కరించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీఓ ఆత్రం భాస్కర్ సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారని సర్పంచ్ కుంర భీంరావు తెలిపారు.
