ప్రతి విద్యార్థిని చట్టాలపై అవగాహన ఉండాలి..

ప్రతి విద్యార్థిని చట్టాలపై అవగాహన ఉండాలి..

జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : ప్రతి విద్యార్థిని చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర అన్నారు. కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయంలో పోలీస్ శాఖ ద్వారా కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాబృందం విద్యార్థినిలకు మహిళచట్టాలపై, మూఢనమ్మకాలపై, మూడఆచారాలు,వరకట్నం,బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జుక్కల్ ఎస్ఐ నవీన్ చంద్ర మాట్లాడుతూ బాలికల, మహిళల రక్షణ,మహిళల అభ్యున్నతికి కోసం ప్రభుత్వం ఎన్నో రకాల చట్టాలు తీసుకురావడం జరిగిందని, ముఖ్యంగా విద్యహక్కు చట్టం,మహిళలకు మానసిక వేధింపులు,వేకారిచేష్టాలు, బాల్యవివాహాలు,వరకట్న నిషేధం,లైంగిక వేధింపు నిరోధక చట్టాలను తీసుకురావడం జరిగిందని, ప్రభుత్వం బాలికల, మైనర్ల,మహిళల కోసం టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని,విపత్కర పరిస్థితిలో 100 నెంబర్ కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని,పోలీస్ శాఖ మహిళల రక్షణ కోసం కట్టుబడి ఉందన్నారు.ఈ సందర్భంగా బాలికల విద్యాలయ నిర్వాహకురాలు హేమలతతో పాటు ఉపాధ్యాయుల బృందం,పోలీసులు పాల్గొన్నారు.

Leave a Reply