ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి..

ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి..

బిజెపి నాయకుల నిరసన వినతి పత్రం అందజేత

ఉట్నూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బిజెపి రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ తాసిల్దార్ కార్యాలయం ముందు బిజెపి పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నాయకులు నిరసన వ్యక్తం చేసి డిప్యూటీ తాసిల్దార్ అమృత్ లాల్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు బి0గి వెంకటేష్, నిర్మల్ జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, రాష్ట్ర నాయకులు భానోత్ జగన్ నాయక్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆరు గ్యారంటీలను అలాగే రైతులకు రైతు భరోసా రైతుబంధు ఒకసారి ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వికలాంగులకు వితంతువులకు వృద్ధులకు ఇస్తామన్న పెన్షన్లు వెంటనే అమలు చేయాలి నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో భారతీయ జనతా పార్టీ ఉట్నూరు మండల అధ్యక్షులు బింగి వెంకటేష్, జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, సీనియర్ నాయకులు శ్రీరామ్ నాయక్ జిల్లా నాయకులు భానోత్ జగన్ నాయక్, ఆడే ధన్ లాల్, సాడిగే రాజేశ్వర్, సీపతి లింగ గౌడ్, కందుకూరి రమేష్, సాల్గర్ రవీందర్, కాల్వ రవి, బొడ్డు కిరణ్,నాగభూషణం, పొన్నం జగన్, సానా గోపికృష్ణ, అర్జున్ సింగ్, గాలి శ్రీకాంత్, కనక విజయ్, ఆడే ఉపేందర్, అరవింద్, పోతు రవి, గంట విజయ్, ఉగ్గే విజయ్, చింతల రమణ,రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply