TG | తపస్ జిల్లా అధ్యక్షుడికి ఘన సన్మానం
TG | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : నారాయణపేట మండలంలోని జాజాపూర్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు నరసింహ తపస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఇవాళ జాజాపూర్ గ్రామంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సంగీత, ఉపసర్పంచ్ లక్ష్మణ్, కాంగ్రెస్ యువ నాయకుడు రవీందర్ రెడ్డి, రాములు, తదితరులు హాజరై నరసింహను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… గ్రామంలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు జిల్లా స్థాయి బాధ్యతలు చేపట్టడం గర్వకారణమని పేర్కొన్నారు. పాఠశాలలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న తపస్ జిల్లా అధ్యక్షుడి సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి, ఉపాధ్యాయ బృందం సభ్యులు విజయ, మధుసూదన్ రావు, లక్ష్మణ్, మంగళ, నిర్మల, శిరీష, రఘురామేశ్వర్ రెడ్డి, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

