KTR | నగరంలో లక్ష మందికి పట్టాలిచ్చాం

KTR | నగరంలో లక్ష మందికి పట్టాలిచ్చాం
KTR | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఈ ప్రభుత్వంలో విధ్వంసం, వినాశనం తప్ప ఏమీ లేదని, తమ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో లక్ష మందికి ఇళ్ల పట్టాలిచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఖమ్మంలో ముగ్గురు మంత్రులకు బినామీలు ఉన్నారన్నారు. కూల్చడం ఎందుకు.. ఇళ్లు కట్టిస్తామనడం ఎందుకు? అని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా కూల్చిన ఇళ్లు మళ్లీ కట్టించేవరకు తాము పోరాడతామన్నారు.
మీకు నచ్చిన వారికి ఇస్తారు.. నచ్చని వాళ్లకు ఇవ్వరా? కేటీఆర్ ప్రశ్నించారు. మీరు సర్కార్ నడుపుతున్నారా.. సర్కస్ నడుపుతున్నారా ..? కచ్చితంగా సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. భూ మాఫియా చేసింది మీరు… పేదవారికి 100గజాలు ఇచ్చిందే భూదాన్ బోర్డు అన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నవారికి కూడా పట్టాలివ్వలేదన్నారు. తప్పు పని చేశారని మీరే ఒప్పుకున్నారన్నారు. తప్పుకు క్షమాపణలు కూడా మీరే చెప్పాలని కేటీఆర్ అన్నారు.
