బీమా సొమ్ము మృతుడి భార్యకు అందజేత..

బీమా సొమ్ము మృతుడి భార్యకు అందజేత..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని శ్రీరామ్ నగర్ విధికి చెందిన మాల వెంకటప్ప మృతిచెందడంతో మృతుని భార్య చెన్నమ్మకు మంగళవారం పొదుపుసంఘం ద్వారా బీమా డబ్బులు అందజేశారు. శ్రీ ప్రగతి సహకార పొదుపు సంఘం జిల్లా బాధ్యులు ఉదయభాను, మండల అధ్యక్షులు పూజారినారాయణ, మాజీ ఉపసర్పంచ్ కొండన్ గోపాల్, లు మృతిని భార్య చెన్నమ్మకు రూ 91104 నగదు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రగతి సహకార పొదుపు సంఘం నెలకు 100 రూపాయలు చొప్పున పొదుపు చేస్తూ ఆకస్మికంగా వెంకటప్ప మృతి చెందడంతో భీమా డబ్బులు అందజేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ హన్మంతు, అంజి తదితరులు పాల్గొన్నారు.
