ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక..

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక..
మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగముగా శుక్రవారం మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు లో పారిశుద్ధ్య పనులను జిల్లా ప్రత్యేకాధికారి, సి డి ఎం ఏ డిప్యూటీ డైరెక్టర్ సీహెచ్ జ్యోష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి మాట్లాడుతూ 99 రోజుల ప్రగతి ప్రణాళికను సక్రమముగా నిర్వహించాలన్నారు.మున్సిపాలిటీ లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేయాలన్నారు. శానిటేషన్, త్రాగునీరు, లైట్లు,మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే.సతీష్ కుమార్, మేనేజర్ ప్రభాకర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
