పట్టణ అభివృద్ధికి సహకరించాలి

పట్టణ అభివృద్ధికి సహకరించాలి
ఫోటో:ప్రతిజ్ఞ చేస్తున్న కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది లు
తొర్రూరు మున్సిపల్ చైర్మన్ శ్రావణ్ కుమార్
తొర్రూరు, ఆంధ్రప్రభ : తొర్రూరు పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని తోరూర్ మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ కోరారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మునిసిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక షెడ్యూల్ ప్రకారం మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బందులచే ప్రతిజ్ఞ చేయించి, 10వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడానికి శ్రీకారం చుట్టిందని, దీనిలో భాగంగా మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరు సమన్వయంతో పట్టణ అభివృద్ధికి పాటుపడాలన్నారు. అన్ని వార్డులలో పనులు జరిగే విధంగా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు, యువకులను భాగస్వామ్యం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ సోమ రజని రాజశేఖర్, కౌన్సిలర్లు తూర్పాటి రవి, మాడుగుల భవానిలత, అల్లం శ్యామల, కిన్నెర కవిత, ముద్దసాని సురేష్, ధరావత్ పద్మ,చకిలేల అలివేణి, జాటోత్ భద్రు నాయక్, మున్సిపల్ సిబ్బంది,మెప్మా, ఆర్పీలు, తదితరులు పాల్గొన్నారు.
