విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిర

విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిర
కంటి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులతో లయన్స్ క్లబ్ సభ్యులు
మక్తల్ , ఆంధ్రప్రభ : లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ భీమా ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షుడు సత్యాంజనేయులు ఆధ్వర్యంలో ప్రోగ్రాం ఛైర్మన్ అనుగొండ శ్రీనివాసులు, పాలమూరు రాంరెడ్డి కంటి ఆసుపత్రి సహకారంతో శుక్రవారం లయన్స్ భవన్ ఆవరణలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైంది. ఈ సందర్భంగా సుమారు వంద మంది వరకు కంటి పరీక్షలు చేయించుకోగా… దాదాపు 60 మంది వరకు కంటి శస్త్ర చికిత్సల కోసం పాలమూరు రాంరెడ్డి కంటి ఆసుపత్రి కి తరలించామని తెలిపారు. ఇప్పటి వరకు వేలాది మందికి ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు చేయించామని క్లబ్ అధ్యక్షులు సత్యాంజనేయులు చెప్పారు. లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలలో ప్రధానంగా ఉచిత కంటి వైద్య శిబిరాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు.
పూర్తిగా వెనుకబడిన మక్తల్ ప్రాంతంలో అనేకమంది కంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారని అన్నారు. ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్న ప్రజలు వేలకు వేలు ఖర్చుపెట్టి కంటి ఆపరేషన్లు చేసుకునే పరిస్థితి లేకపోవడం బాధాకరమని అన్నారు. అందుకే అలాంటి నిరుపేద ప్రజల కోసం లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ భీమా ప్రత్యేకంగా ఉచిత కంటి వైద్య శిబిరాలకు ప్రాధానమిస్తోందని అన్నారు.ప్రతినెల క్రమం తప్పకుండా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి అంజన్ కుమార్,సహాయ కార్యదర్శి మామిళ్ల పృథ్వీరాజ్, అంబాదాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
