పెండింగ్ వేతనాలు చెల్లించేందుకు మంత్రి హామీ

పెండింగ్ వేతనాలు చెల్లించేందుకు మంత్రి హామీ
ఉట్నూర్, ఆంధ్రప్రభ : గిరిజన సంక్షేమ శాఖ అశ్రమ వసతి గృహాల్లో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగుల వర్కర్ల ఏడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని శుక్రవారం హైదరాబాదులోని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు కలిసి వినతి పత్రం ఇచ్చినట్లు తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కేబీసీ నారాయణ తెలిపారు. మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇచ్చి సంఘ నాయకులు కలిసి మంత్రికి సన్మానం చేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ సానుకూలంగా స్పందించి రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖ అశ్రమ వసతి గృహాల్లో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగుల వర్కర్ల పెండింగ్ వేతనాలు చెల్లించేలా గిరిజన సంక్షేమ శాఖ సంబంధిత రాష్ట్ర అధికారులకు మాట్లాడి నిధులు విడుదల అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.
బడ్జెట్ నిధులు ఉన్నాయని ఈ విషయంలో అధికారులతో మాట్లాడి నిధులు విడుదల అయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలిపామని ఆయన అన్నారు అనంతరం ప్రజాభవన్ గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర కమిషనర్ అధికారులకు కలిసి పెండింగ్ వేతనాలు నిధులు విడుదల చేయాలని ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగుల వర్కర్లకు వేతనాలు పెంచాలని విన్నవించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి భూక్య వాల్ సీమ, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు సౌకత్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి సిడం శ్రీనివాస్, కొమరం అశ్వ బాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కే రామచందర్, కే పోచం, నిర్మల్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజలింగు, వసంత్ రావు, మంచిర్యాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దిలీప్ కుమార్, స్వాతి,సంఘ నాయకులు సోనేరావు, రంభ, ఈరమ్మ, అశోక్, విట్టల్, చిరంజీవి, రవి, కైలాస్, లింగన్న,చంద్రకాంత్, శారద గోవింద్ తదితరులు పాల్గొన్నారని రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కేబీసీ నారాయణ తెలిపారు.
