ఇందిరమ్మ ఇళ్లు నూతన గృహ ప్రవేశం ప్రారంభం..

ఇందిరమ్మ ఇళ్లు నూతన గృహ ప్రవేశం ప్రారంభం..
కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో నిర్మాణం పూర్తి అయిన నూతన ఇందిరమ్మ ఇల్లును కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యల సునీల్ కుమార్,గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి నూతన గృహ ప్రవేశన్నీ శుక్రవారం ప్రారంబించారు.ఈ సందర్భంగా బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరుపేదలకు ఇల్లు కట్టించి వారి కళ్ళలో ఆనందం చూడాలని,స్వంత ఇంటి కళ నిజం చేయాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల గృహ నిర్మాణ పథకం విజయవంతంగా ముందుకు సాగుతోందనీ,రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తామని అన్నారు. నూతన గృహ ప్రవేశం చేసిన మేడిపల్లి రాణి రాజేష్ కి హార్థిక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సుంకేట రవి, నిమ్మ రాజేంద్రప్రసాద్,బుచ్చి మల్లయ్య, సుంకరి విజయ్ కుమార్, అజ్మత్ పాషా,నాయకులకు, కార్యకర్తలకు తదితరులు పాల్గొన్నారు.
